ఆ స్కూల్ జ్ఞానానికి కేంద్రంగా తయారవుతోంది. ఒక ఉపాధ్యాయుడు చేసిన ఆలోచన ఆ స్కూల్‌నే మార్చేసింది. ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్ పెరిగినప్పుడు, వాళ్ల ఇంట్లో పుట్టినరోజు, శుభ కార్యాలు జరిగినప్పుడు పాఠశాలకు పుస్తకాలు బహూకరించడం అలవాటు చేసుకున్నారు. అదే అలవాటు విద్యార్థుల్లోనూ స్ఫూర్తి నింపింది. వాళ్లు కూడా తమ పుట్టినరోజు నాడు ఒక పుస్తకం బహూకరించారు. ఇప్పుడు ఆ పాఠశాల ఒక గ్రంథాలయంగా మారింది. పుస్తక పఠనంతో విద్యార్థుల్లో మరింత జ్ఞానం పెంపొందుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు.