శ్రావణ మాసం రాకతో పూజల్లో ఉపయోగించే వాటికి మంచి డిమాండ్ పెరిగింది. మొన్నటి వరకు చాలా తక్కువ ధరకు వచ్చిన వస్తువులు ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి. తమలపాకులు అత్యధికంగా 30 ఆకులు రూ. 50 పలుకుతుండగా.. కొబ్బరికాయ మీడియం సైజు కూడా రూ. 50 అమ్మేస్తున్నారు. అరటిపళ్లు డబుల్ అవ్వగా.. పూలు కూడా భారీగా పెరిగాయి. చిట్టి గులాబీలు రూ. 200 నుంచి రూ. 350.. చామంతులు రూ. 150 నుంచి రూ. 350 వరకు పెరిగింది. దాంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.