మున్సిపల్ ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఆర్మూర్ జెడ్పీ మహిళా హైస్కూల్ హెడ్మాస్టర్ వనజా రెడ్డి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆర్మూర్‌లోని 4, 5, 6 వార్డులకు రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు పొందిన ఆమె.. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యారు. దీనిని తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, కఠిన చర్యలకు ఆదేశించడంతో జిల్లా విద్యాశాఖాధికారి ఆమెను సస్పెండ్ చేశారు. మరోవైపు.. బాన్సువాడలో నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని.. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా లేదా విధుల్లో అలసత్వం వహించినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.