Kazipet Railway: కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు వచ్చే మార్చి నుంచే ప్రారంభమవుతాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు. ఏడాదికి 600 కోచ్‌లు తయారు చేయగల సామర్థ్యం ఉన్న ఈ యూనిట్ పనులను ఆమె కేఆర్ నాగరాజుతో కలిసి పరిశీలించారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని... భూ బాధితులకు అన్యాయం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 30 ఏళ్ల కల కాంగ్రెస్ పాలనలోనే సాకారం అవుతుందని ఆమె పేర్కొన్నారు.