ఆ జిల్లా పూర్తిగా GHMCలో విలీనం.. వేగంగా అభివృద్ధి, మారనున్న రూపురేఖలు

8 months ago 17
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మరో కొత్త రూపు సంతరించుకోనుంది. ఇప్పటికే 24 నియోజకవర్గాలు, 150 డివిజన్లతో విస్తరించి ఉన్న GHMCలో.. తాజాగా గ్రామ పంచాయతీలు లేని జిల్లాగా రూపుదిద్దుకున్న మేడ్చల్ జిల్లాలోని మున్సిపాలిటీలను విలీనం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లాలో ఇప్పటికే ఉన్న 10 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లతో పాటు, కొత్తగా ఏర్పడిన 3 మున్సిపాలిటీలు కూడా గ్రేటర్‌లో భాగం కావడం వల్ల హైదరాబాద్ సరిహద్దులు మరింత విస్తరించి, మహానగర అభివృద్ధి వేగంగా జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
Read Entire Article