తెలంగాణ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణంగా దెబ్బతిన్న 88 రోడ్లను అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చింది. దీని కోసం రూ.220.55 కోట్లు ఖర్చు చేయనుంది. వర్షాలకు పాడైన, బీటీకి నోచుకోని రోడ్లను ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పలు నియోజకవర్గాల్లోని కీలక రహదారుల మరమ్మతులకుగాను ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. మొత్తం 298.45 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.