ఏపీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు చకా చకా అడుగులు పడుతున్నాయి. రూ.65 వేల కోట్ల పెట్టుబడితో ఏపీలో 500 ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం, రిలయన్స్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరిలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్ కోసం కనిగిరిలో 4000 ఎకరాల బంజరు భూమిని లీజుకు ఇచ్చారు. ఈ మేరకు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు.