ఏపీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. రూ.65 వేల కోట్ల పెట్టుబడితో 500 బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఒప్పందంలో భాగంగా తొలి దశలో పల్నాడు, ప్రకాశం జిల్లాలలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో రిలయన్స్ సంస్థ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు వేగవంతం చేయాలని రిలయన్స్ ప్రతినిధులను రవికుమార్ కోరారు.