రాష్ట్రంలో క్రీడల కోటాలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 172 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను పంచాయతీ రాజ్ శాఖ సంచాలకురాలు సృజన శనివారం విడుదల చేశారు. ఈ నియామకాలు గత అయిదేళ్లుగా నిలిచిపోయి ఉండగా.. న్యాయస్థానం సూచనల మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జేపీఎస్‌ల నియామకంపై రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌లు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.