Nara Lokesh On Anand Mahindra Tweet: రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహీంద్రా గ్రూప్ ఏపీలో ట్రక్కుల తయారీ పరిశ్రమను నెలకొల్పాలని ఆనంద్ మహీంద్రాను ఆహ్వానించారు. అలాగే, కర్ణాటకలో ఏరోస్పేస్ పార్క్ భూసేకరణ రద్దు కావడంతో, ఏపీలో 8 వేల ఎకరాల స్థలం, ప్రోత్సాహకాలు ఇస్తామని లోకేష్ ప్రకటించారు. దీనిపై కర్ణాటక మంత్రి స్పందిస్తూ, తమ రాష్ట్రంలోనే మెరుగైన వసతులు ఉన్నాయని తెలిపారు.