హైడ్రాకు ఛైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నట్టు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మీడియా సమావేశం నిర్వహించిన రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో చెరువులకు సరిహద్దులు, బఫర్‌జోన్‌లు నిర్ణయిస్తున్నట్లు రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 200 ఎకరాలను కాపాడినట్టు రంగనాథ్ తెలిపారు. త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్ నిర్మించనున్నట్టు రంగనాథ్ తెలిపారు.