కర్నూలు బస్సు ప్రమాదంతో స్లీపర్ బస్సులపై తీవ్ర చర్చ జరుగుతోంది. స్లీపర్ బస్సులు గతంలో కూడా అనేక సార్లు ప్రమాదానికి గురయ్యాయి. అయినా వాటిపై చర్యలు తీసుకోవడం లేదు. చైనా, జర్మనీ వంటి దేశాలు స్లీపర్ బస్సులను ఇప్పటికే నిషేధించాయి. మన దేశంలో మాత్రం కఠిన నిబంధనలున్నా.. అవి అమలుకు నోచుకోవడం లేదు. డిజైన్ లోపాలు, ఇరుకైన క్యాబిన్లు, మండే స్వభావం గల వస్తువులు వంటి వన్నీ స్లీపర్ బస్సులను.. మృత్యు వాహనాలుగా మారుస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.