రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 24 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న వరుస ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాలకు స్పీడ్ లాక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్న మంత్రి.. ఈ రూల్ ఉల్లంఘిస్తే మూడింతలు పెనాల్టీ విధించాలని అధికారులను ఆదేశించారు. టిప్పర్ లారీలు.. కంకర, ఇసుక వంటివి తీసుకెళ్లేటప్పుడు తప్పనిసరిగా టార్పలిన్ కప్పుకోవాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.