Ranganath Clarity: హైదరాబాద్‌లో నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయా ప్రాంతాల్లో చేపట్టిన కూల్చివేతల విషయంలో సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పలు విషయాల్లో క్లారిటీ ఇచ్చారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఇప్పటికే నిర్మించి, అందులో నివాసముంటున్న ఇండ్లను కూల్చబోమని.. కేవలం నిర్మాణ దశలో ఉన్నవాటినే కూల్చనున్నట్టు రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ఈ స్టేట్ మెంట్‌తో సోషల్ మీడియాలో సరికొత్త చర్చ మొదలైంది.