త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు వస్తాయని.. కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కానున్నారంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 29వ తేదీన దీక్షా దివస్‌ను పురస్కరించుకుని.. వరంగల్, జనగామలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు.. జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తర్వలోనే దేశంలో జమిలి ఎన్నికలు రానున్నాయని.. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ జోస్యం చెప్పారు ఎర్రబెల్లి.