విశాఖ సెంట్రల్ జైలును హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. జైల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా జైలు బయట మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే వారిపై కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. తన పర్సనల్ పీఏపై ఆరోపణలు వచ్చిన వెంటనే తొలగించినట్లు చెప్పారు. ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తే సొంత బిడ్డల్నైనా వదిలేది లేదని హెచ్చరించారు.