తెలంగాణలో సోషల్ మీడియా కార్యకలాపాలపై సైబర్ క్రైం పోలీసులు నిఘా పెట్టారు. నకిలీ ఖాతాలు, మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకర కంటెంట్‌తో మోసాలు పెరగడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ చేసిన ఘటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.