ప్రభుత్వ పాఠశాల ఎదుట అడ్మిషన్స్ క్లోజ్ బోర్డు ఉంటుందని ఎప్పుడైనా అనుకున్నారా.. కానీ ఏపీలోని ఓ పాఠశాలకు మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. తమ పిల్లలకు అడ్మిషన్ ఇవ్వాలంటూ భారీగా వస్తున్నారు. దీంతో స్కూలు యాజమాన్యం గేటు ముందు అడ్మిషన్స్ క్లోజ్ అంటూ బోర్డు పెట్టేసింది. ఈ స్కూలు ఎక్కడుందని అనుకుంటున్నారా.. నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ వద్ద పరిస్థితి ఇది. దీనిపై నారా లోకేష్ కూడా స్పందించారు. ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమంటూ ట్వీట్ చేశారు.