హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు, కొత్తగా నిర్మించే రీజినల్ రింగు రోడ్డు మధ్య ప్రాంతం మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మరబోతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ప్రాంతాల్లో నెలకొల్పే సంస్థల ద్వారా కొత్తగా 5 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో మెుదలైన 'బయో ఆసియా -2025' సదస్సులో ప్రసగించిన సీఎం.. తెలంగాణలో దేశంలోనే మొట్టమొదటి 'లైఫ్ సైన్సెస్ పాలసీ'ని తీసుకురానున్నట్లు చెప్పారు.