బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సినీ నిర్మాత కేదార్‌నాథ్ కేటీఆర్ వ్యాపార భాగస్వామి అని.. అతడు ఇటీవల మృతి చెందినట్లు చెప్పారు. కాళేశ్వరంపై కేసు వేసిన రాజలింగమూర్తి, కేసును వాదిస్తున్న సంజీవరెడ్డి సైతం ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ మరణాలన్నీ మిస్టరీగానే ఉన్నాయని.. అయినా కేటీఆర్ ఎందుకు విచారణ కోరట్లేదో చెప్పాలన్నారు.