Mulugu SP Shabarish: ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని చల్పాక అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. అయితే... ఈ ఎన్‌కౌంటర్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో.. జిల్లా ఎస్పీ శబరీష్ స్పందించారు. తమకు ఉదయం సమయంలో మావోయిస్టులు తారసపడ్డారని.. పోలీసులను చూసిన వెంటనే వాళ్లు కాల్పులు మొదలుపెట్టారన్నారు. లొంగిపోవాలని ఎంత చెప్పినా వినలేదని.. అందుకే ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు