తెలంగాణలో అభివృద్ధిలో కీలకమైన రహదారుల విస్తరణపై సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే పలు రహదారులను అప్‌గ్రేడ్ చేస్తున్న సర్కార్.. తాజాగా హైదరాబాద్-నాగార్జున సాగర్ హైవే విస్తరణకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ రహదారి 2 వరసలుగా ఉండగా.. నాలుగు వరుసలుగా విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం అధికారులన ఆదేశించారు.