తెలంగాణలో పామాయిల్ సాగును పెంచాలని పదే పదే చెప్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.. ఇప్పటికే సాగు చేస్తున్న రైతులకు గుడ్ న్యూస్ వినిపించింది. పామాయిల్ పంటకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. టన్నకు 20 వేల 871 రూపాయలుగా నిర్ణయించింది. ఈ మేరకు.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా.. పామాయిల్ రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.