తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో రూ.10,500 కోట్ల వ్యయంతో 5,500 కిలోమీటర్ల పొడవున హ్యామ్ (HAM) రోడ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే.. ఆచార్య జయశంకర్ వర్సిటీకి అనుబంధంగా నల్గొండ, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో మూడు కొత్త వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు కూడా అంగీకారం లభించింది. ప్రజా పాలన - విజయోత్సవాల నిర్వహణపైనా.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలనే అంశాలపైనా చర్చించారు.