ఈ సంవత్సరం ఇంజనీరింగ్ చేసే విద్యార్థులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రస్తుతం మొదటి, రెండో దశ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ పూర్తవ్వగా.. ఎప్‌సెట్‌లో వారు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తున్నారు. చాలా మంది ఇంజనీరింగ్ సీటు రాని విద్యార్థులు తుది విడత కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. వారి కోసం తెలంగాణ యూనివర్సిటీ శుభవార్త చెప్పింది. దీనికి అనుబంధంగా మరో కళాశాల మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 5 నుంచి నిర్వహించే తుది విడత కౌన్సెలింగ్‌లో వీటిలో సీటు తెచ్చుకునేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.