పదిహేనేళ్లు దాటిన పాఠశాల బస్సులను సీజ్ చేయాలని రవాణా శాఖ అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశించారు. స్కూల్ బస్సుల తనిఖీలు నిరంతరం నిర్వహించాలన్నారు. రోడ్ సేఫ్టీపై స్కూల్స్, కాలేజీల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు చేయాలన్నారు.