తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య జోరుగా విమర్శలు నడుస్తున్న వేళ.. తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పెట్టిన పోల్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ పోల్ ఫలితాల్లో.. పోల్ పెట్టిన కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఓట్లు రాగా.. ఫామ్ హౌస్ పాలనగా పేర్కొన్న బీఆర్ఎస్‌కే ఎక్కువ ఓట్లు రావటం గమనార్హం. ఈ నేపథ్యంలో.. గులాబీ నేతలు సంధిస్తోన్న సెటైర్లకు కాంగ్రెస్ సోషల్ మీడియా ఛైర్మన్ మన్నె సతీష్ తనదైన శైలీలో కౌంటర్ ఇచ్చారు.