ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాప్రనిధుల వరుస ఆరోపణలు రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొన్నటి వరకు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారగా.. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేకు సంబంధించిన కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో.. టీడీపీ అధిష్టానం ఆయనను సస్పెండ్ చేసింది. కాగా.. ఇప్పుడు ఆయన కుటుంబం మీడియా ముందుకొచ్చి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ తండ్రిపై వైసీపీ నేత కుట్ర చేస్తున్నారని ఆదిమూలపు కుమార్తె ఆరోపించారు.