Andhra Pradesh Another Low Pressure Update: తెలుగు రాష్ట్రాలకు పెద్ద ముప్పు తప్పింది. వాయుగుండం ప్రభావం తప్పిపోయిందని.. కానీ పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం రెండు మూడ్రోజుల్లో వాయుగుండంగా మారి తీవ్రం అవుతుందని తెలిపారు. అయితే ఆ వాయుగుండం వాయువ్యంగా పయనిస్తూ ఉత్తర ఒడిశా, బెంగాల్ తీరాల వైపు వెళుతుందన్నారు. తెలుగు రాష్ట్రాలకు ఈ వాయుగుండం ముప్పు తప్పినట్లయింది. కానీ ఈ ప్రభావంతో ఈ నెల 8 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.