Andhra Pradesh Gst Collection: తెలుగు రాష్ట్రాల జీఎస్టీ లెక్కలు వచ్చేశాయి. డిసెంబర్ నెలకు సంబంధించిన వసూళ్ల విషయానికొస్తే.. గతనెల (డిసెంబర్) తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 10 శాతం వృద్ధి చెంది రూ.5,224 కోట్లకు పెరగగా.. ఆంధ్రప్రదేశ్‌లో వసూళ్లు 6 శాతం తగ్గి రూ.3,315 కోట్లకు పరిమితం అయ్యాయి. తెలంగాణతో పోలీస్తే ఏపీకి జీఎస్టీ వసూళ్లు తగ్గాయి. నవంబర్ నెలలో కూడా జీఎస్టీ వసూళ్లు తగ్గిన సంగతి తెలిసిందే.