IAS K Vijayanand: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెల 31వ తేదీ పదవీ విరమణ చేయన్నారు. ఈ క్రమంలో నూతన ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్‌ను నియమించారు. కె విజయానంద్ ప్రస్తుతం ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్నారు.. ఆయన త్వరలోనే సీఎస్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది నవంబరు నెలాఖరున విజయానంద్ పదవీ విరమణ చేయనున్నారు.