PM Narendra Modi Nellore District Tour: ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించబోతున్నారు. వచ్చే నెల 6న ప్రధాని నెల్లూరు జిల్లాకు రానున్నారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం దగ్గర.. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెజ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. అధికారులు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి నెల్లూరు జిల్లా అధికారులు ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది.