Andhra Pradesh Droupadi Murmu Visit: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (AIIMS) ప్రథమ స్నాతకోత్సవానికి ఈ నెల 17వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. విజయవాడ నుంచి ఎయిమ్స్‌కు రోడ్డు మార్గాన రాష్ట్రపతి రానున్నందున తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించారు. రాష్ట్రపతి హాజరవుతున్న ఈ కార్యక్రమ నిర్వహణకు నియమించే వివిధ కమిటీల ఏర్పాట్లపై సమీక్షించారు.