ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును రద్దు చేసిందంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే వైరల్ అవుతున్న ఈ వార్తలు తప్పుదారి పట్టించేవిగా తేలింది. చట్టపరమైన, పరిపాలన, ప్రాతినిధ్య సమస్యల కారణంగా గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన వక్ఫ్ బోర్డును రద్దుచేసిన అంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. త్వరలో నూతన వక్ఫ్ బోర్డు నియమిస్తామని తెలిపింది. గతంలో నిబంధనలు ఉల్లంఘించి వక్ఫ్‌బోర్డు ఏర్పాటు చేశారని.. త్వరలో నిబంధనల ప్రకారం సమర్థులు, అర్హులైన సభ్యులతో వక్ఫ్ బోర్డు నియమిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.