Andhra Pradesh 17 New Hotels In Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్రీ స్టార్ హోటళ్లలో బార్ లైసెన్సు ఫీజు రూ.25 లక్షలకు తగ్గించింది. ఈ నిర్ణయంపై రాష్ట్ర హోటళ్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పింది. ఈ నిర్ణయంతో హోటళ్ల రంగానికి ఆర్థికంగా ఊరట కలుగుతుందని.. ప్రభుత్వ ప్రోత్సాహంతో అమరావతిలో కొత్త హోటళ్లు వస్తున్నాయన్నారు. అక్కడ కొత్తగా 17 హోటల్స్ రాబోతున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వానికి మరికొన్ని రిక్వెస్ట్‌లు చేశారు.