AP Teachers Transfers Bill: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీల కోసం ముసాయిదా బిల్లును తీసుకురావాలని భావిస్తోంది. ఈ బిల్లును బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కొంతకాలంగా పాఠశాల విద్యాశాఖ బదిలీల చట్టంపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను స్వీకరించారు. మళ్లీ వచ్చే శుక్రవారం సంఘాల నాయకులతో సమావేశమై తుది సలహాలు తీసుకోవాలని నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదం పొందేలా ప్లాన్ చేశారు.