Machilipatnam Repalle Railway Line: దివిసీమ ప్రజల చిరకాల కోరిక మచిలీపట్నం- రేపల్లె రైల్వేలైను ఏర్పాటు చేయాలని మరోసారి రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కోరారు. తెనాలి జంక్షన్‌కు చేరుకుంటే అక్కడి నుంచి చెన్నై, తిరుపతి, ఇతర ప్రాంతాలకు సులువుగా వెళ్లొచ్చు. తద్వారా పాటు విజయవాడ జంక్షన్‌పై భారం తగ్గుతుంది అన్నారు. అయితే రైల్వేమంత్రి కూడా సానుకూలంగా స్పందించారని.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని బాలశౌరి ఆశాభావం వ్యకం చేశారు.