తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రాల విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు సహకరించాలని మంత్రి తుమ్మల కోరారు. అంతేకాకుండా తిరుమలలో తెలంగాణకు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.