పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడులో తలపెట్టిన రామాలయ నిర్మాణానికి ఇప్పటి వరకూ కోటి రూపాయలు విరాళంగా సమకూరింది. ఈ విషయాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. ఈ మొత్తాన్ని భక్తులే అందించారని తెలిపారు. ఆకివీడు రామాలయం నిర్మాణంపై హైకోర్టు తాజాగా జారీ చేసిన ఆదేశాలపై స్పందించిన రఘురామకృష్ణరాజు.. అన్ని అనుమతులు తీసుకునే రామాలయం కడతామని మరోసారి స్పష్టం చేశారు.