ఏపీ ప్రభుత్వం ఆక్వా రైతులకు తీపికబురు వినిపించింది. ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ సౌకర్యం కల్పిస్తోంది. యూనిట్ విద్యుత్ రూ.1.50లకు అందిస్తోంది. దీనికి సంబంధించిన జీవోను ఆంధ్రప్రదేశ్ మంత్రులు మంగళవారం రోజున పాలకొల్లులో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. అర్హత కలిగిన ఆక్వా రైతులకు సబ్సిడీ విద్యుత్ అందించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు.