బంగారు నగ పోయిందంటూ ఓ మహిళ హడావిడి చేసిన ఘటన గుత్తిలో చోటుచేసుకుంది. గుత్తిలో నివాసం ఉంటున్న ఓ మహిళ బంగారు నగ గురువారం కనిపించలేదు. దీంతో ఆ మహిళ కంగారుపడిపోయింది. తన బంగారు నగను ముసుగు వేసుకుని వచ్చిన ఓ ఆగంతకుడు చోరీ చేశాడంటూ వాపోయింది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి విచారించాల్సి వచ్చింది. అయితే ఆ మహిళ ఇంటిని పరిశీలించే సమయంలో బెడ్రూమ్‌లోని మంచం మీద నగ కనిపించింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.