హైదరాబాద్‌లో పేదల ఆకలి తీర్చేందుకు రేవంత్ సర్కార్ సరికొత్త పథకం ప్రవేశపెట్టనుంది. ఆగస్టు 15 నుంచి ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా కేవలం 5 రూపాయలకే టిఫిన్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొదట కొన్ని ప్రాంతాల్లో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభించి, ఆ తర్వాత నగరమంతటా విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. అధికారిక ప్రకటన వస్తే దీనిపై పూర్తిగా క్లారిటీ వస్తుంది.