ఆటో ఛార్జీల పెంపు ప్రతిపాదన.. తొలి 1.6 కి.మీ. దూరానికి రూ.30, ఆ తర్వాత ఎంతంటే..?

1 hour ago 1
తెలంగాణలో ఆటో రిక్షా ఛార్జీల పెంపునకు అధికారుల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. 1.6 కిలోమీటర్లకు కనీస ఛార్జీ రూ.30, ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.14గా నిర్ణయించాలని సూచించింది. వెయిటింగ్‌ ఛార్జీ నిమిషానికి 75 పైసలు, రాత్రి వేళల్లో సాధారణ ఛార్జీపై 50 శాతం అదనంగా వసూలు చేయాలని ప్రతిపాదించింది. ఇంధనం, బీమా, నిర్వహణ, రుణభారం, డ్రైవర్‌ ఆదాయం వంటి అంశాలను కమిటీ పరిగణనలోకి తీసుకుంది. గత 12 ఏళ్లుగా ఛార్జీలు మారలేదని పేర్కొంది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత కొత్త ఛార్జీలపై ఉత్తర్వులు వెలువడనున్నాయి.
Read Entire Article