తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో కొత్త విమానాశ్రయం ఏర్పాటు కోసం భారత వాయుసేన అనుమతులు మంజూరు చేసింది. పౌరవిమాన సేవల ప్రారంభం, వాయుసేన శిక్షణ కేంద్రం ఏర్పాటుకు వీలు కల్పించారు. దీని వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి, జిల్లా అభివృద్ధిని పెంపొందించడంలో కీలకంగా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం మామునూరు ఎయిర్‌పోర్ట్ అనంతరం ఇక్కడ మరో విమానాశ్రయానికి అనుమతులు పొందింది. కొత్త ఎయిర్ పోర్ట్ కార్యకలాపాలకు భారత వాయు సేన అనుమతి మంజూరు చేయడం గర్వకారణం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.