ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో కీలక ముందడుగు వేసింది. ముగ్గురు కేంద్రమంత్రులు సమావేశమై ప్రాజెక్టు పురోగతిపై సమీక్షించారు. రక్షణ, పౌర విమానయాన, తెలంగాణ ప్రభుత్వాల నుంచి ఒక్కొక్క నోడల్ అధికారిని నియమించడంతో పాటు డీపీఆర్, మాస్టర్ ప్లాన్‌ను వేగంగా సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉన్న భూమికి అదనంగా మరో 1500 ఎకరాల భూమిని సేకరించనున్నారు. 2.75 కిలోమీటర్ల రన్‌వేతో పాటు సివిల్ టెర్మినల్, ఎంఆర్ఓ, ఎయిర్‌ఫోర్స్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు.