ఆపదలో అండగా నిలిచిన కేటీఆర్.. స్వదేశానికి మహేశ్..

9 months ago 28
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మానవతా దృక్పథం మరో నిండు ప్రాణాన్ని కాపాడింది. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, అక్కడే చిక్కుకుపోయిన మంద మహేష్‌ను కేటీఆర్ చొరవతో క్షేమంగా స్వదేశానికి రప్పించారు. ప్రమాదంలో మహేష్‌తో పాటు ప్రయాణిస్తున్న ఎనిమిది మంది దురదృష్టవశాత్తు మరణించారు. తనను స్వదేశానికి చేర్చాలని సెల్ఫీ వీడియో ద్వారా మహేష్ కేటీఆర్‌ను వేడుకోగా, ఆయన వెంటనే స్పందించి ధైర్యం చెప్పారు. సౌదీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు ఏర్పాట్లు చేసి, మహేష్ స్వదేశానికి తిరిగి రావడానికి అవసరమైన అన్ని సహాయాలను అందించారు. మహేష్ క్షేమంగా హైదరాబాద్ చేరుకోవడంతో, అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనై, కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Entire Article