నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట SLBC సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం ర్యాట్ హోల్స్ మైనర్స్‌ను రంగంలోకి దించింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆరుగురు మైనర్లు కాసేపట్లో రెస్క్యూ ప్రారంభించనున్నారు. 2023లో ఉత్తరాఖండ్ సిల్కియారా సొరంగంలో 41మంది కార్మికులు చిక్కుకోగా 17 రోజులు ప్రయత్నించినా అధికారులు బయటికి తీసుకురాలేకపోయారు. చివరికి ఈ ర్యాట్ హోల్ మైనర్లు ఒక్కరోజులోనే వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.