ఛత్తీస్గఢ్ రాష్ట్ర బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత గుమ్మడవెల్లి రేణుక అలియాస్ భాను మరణించింది. వరంగల్ జిల్లా జనగాంలోని కడివెండి గ్రామానికి చెందిన రేణుకపై రూ. 45 లక్షల రివార్డు ఉంది. భద్రతా దళాల ఎన్ కౌంటర్ తో మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది.