విశాఖ జిల్లాలో కలకలం రేపిన జంట ఆత్మహత్యల వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విశాఖ జిల్లాలోని ఓ గ్రామంలో సోమవారం నిమిషాల వ్యవధిలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందులో ఒకరు 30 ఏళ్ల వివాహిత కాగా.. మరొకరు 22 ఏళ్ల యువకుడు. ఒకే రోజు ఒకే గ్రామంలో ఇద్దరు వేర్వేరు చోట్ల బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. దీనిపై బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో నమ్మలేని విషయాలు వెలుగులోకి వచ్చాయి.