అల్లు అర్జున్ కేసు వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని తప్పుబట్టాల్సిన పని లేదంటూ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడటంపై బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి ఎందులో గొప్ప.. ఏ విషయంలో గొప్పగా కనిపించారో పవన్ కళ్యాణ్‌కు మాత్రమే తెలుసని బండి సంజయ్ కామెంట్ చేశారు.